కోలీవుడ్: తమిళ హీరో గా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ సినిమాల్లో మంచి హిట్స్ సాధించి ప్రస్తుతం కేవలం తమిళ్ లోనే మంచి సినిమాలు చేస్తూ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు సిద్దార్థ. ఈ మధ్యన ‘మహా సముద్రం’ అనే సినిమాతో తెలుగులో చాలా కాలం తర్వాత సినిమాలో నటిస్తున్నాడు. సిద్దార్థ్ మామూలుగానే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై, దేశంలో జరిగే ఇన్సిడెంట్స్ పై తన ఒపీనియన్స్ ఓపెన్ గా ట్విట్టర్ లో పెడుతూ ఉంటాడు. సిద్దార్థ్ కొద్దీ రోజులుగా రూలింగ్ లో ఉన్న బీజేపీ పై ట్వీట్లు పెడుతున్నాడు. ఇది రుచించని తమిళ బీజేపీ పార్టీ వర్గాలు సిద్దార్థ్ ఫోన్ నెంబర్ ని సోషల్ మీడియా లో లీక్ చేసాయి. బీజేపీ వర్గాలు సిద్దార్థ్ కి మరియు అతని ఫామిలీ మెంబెర్స్ కి ఫోన్ లు చేసి బెదిరించడం, భయపెట్టడం చేస్తున్నాయి.
దీనికి సిద్దార్థ్ కూడా గట్టిగానే స్పందించాడు. ‘మా నోర్లు మూయించడానికే ఇవన్నీ చేస్తున్నారు.. కానీ మేము ఇంకా మాట్లాడుతాం, ఈ విషయాన్ని ఇక్కడితో వొదిలిపెట్టం’ అని కొన్ని స్క్రీన్ షాట్స్ ఆడ్ చేసి పోలీస్ కంప్లైంట్ కి వెళ్తున్నట్టు తెలిపారు. ‘ఇంకా కాల్స్ చేయండి చేసే వాళ్ళు చేయండి అలాగే నేను తీసుకోబోయే యాక్షన్ కి రెడీ గా ఉండండి ‘ అని ట్వీట్ లో తెలిపాడు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి తనకి సపోర్ట్ ఇచ్చిన ఫాన్స్ కి కృతజ్ఞతలు తెలియచేసాడు. ‘ఇలాంటి పాండెమిక్ టైం లో ఎలాంటి సహాయాలు చేయాలో మొదలు అవి చేయండి — బ్యాక్ టు హెల్ప్’ అని ట్వీట్ చేసాడు.