శబరిమలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంతకల్లు డివిజన్ ద్వారా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ ప్రత్యేక రైలు (వి.యా గుత్తి)
- రైలు నం. 07133 (కాచిగూడ-కొట్టాయం): ఈ రైలు నవంబర్ 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం 6:50 గంటలకు కొట్టాయం చేరుతుంది.
- తిరుగు ప్రయాణ రైలు నం. 07134 (కొట్టాయం-కాచిగూడ): నవంబర్ 15, 22, 29 తేదీల్లో రాత్రి 8:30 గంటలకు కొట్టాయం నుంచి బయలుదేరి, మరుసటిరోజు రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుతుంది.
- హైదరాబాద్-కొట్టాయం ప్రత్యేక రైలు (వి.యా గుంతకల్లు)
- రైలు నం. 07135 (హైదరాబాద్-కొట్టాయం): నవంబర్ 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 4:10 గంటలకు కొట్టాయం చేరుతుంది.
- తిరుగు ప్రయాణ రైలు నం. 07136 (కొట్టాయం-హైదరాబాద్): నవంబర్ 20, 27 తేదీల్లో సాయంత్రం 6:10 గంటలకు కొట్టాయం నుంచి బయలుదేరి, మరుసటిరోజు రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
- నాందేడ్-కొల్లాం ప్రత్యేక రైలు (వి.యా గుంతకల్లు)
- రైలు నం. 07139 (నాందేడ్-కొల్లాం): నవంబర్ 16న ఉదయం 8:20 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు కొల్లాం చేరుతుంది.
- తిరుగు ప్రయాణ రైలు నం. 07140 (కొల్లాం-నాందేడ్): నవంబర్ 18న తెల్లవారుజాము 2:30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నాందేడ్ చేరుతుంది.
- మౌలాలి-కొల్లాం ప్రత్యేక రైలు (వి.యా గుంతకల్లు)
- రైలు నం. 07141 (మౌలాలి-కొల్లాం): నవంబర్ 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 2:45 గంటలకు మౌలాలిలో బయలుదేరి, మరుసటిరోజు రాత్రి 10:30 గంటలకు కొల్లాం చేరుతుంది.
- తిరుగు ప్రయాణ రైలు నం. 07142 (కొల్లాం-మౌలాలి): నవంబర్ 25, డిసెంబర్ 2 తేదీల్లో తెల్లవారుజాము 2:30 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 1 గంటకు మౌలాలి చేరుతుంది.