
కోలీవుడ్: విజయ్ సేతుపతి – ప్రస్తుతం అన్నిసినిమా ఇండస్ట్రీస్ లో వినిపిస్తున్న పేరు ఇది. ఒక అకౌంటెంట్ స్థాయి నుండి సీరియల్ ఆక్టర్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇపుడు స్పెషల్ క్యారెక్టర్స్ వేసే స్టేజ్ కి వచ్చాడు. కొన్ని బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో విజయ్ సేతుపతి కోసం ప్రత్యేక కారెక్టర్ లు కూడా రాసే స్టేజ్ కి వచ్చాడు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన, చేస్తున్న సినిమాలు చూస్తే దాదాపు నెలకి రెండు సినిమాల్లో విజయ్ సేతుపతి కనిపిస్తాడు.
సంక్రాంతి కి విడుదలైన మాస్టర్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో విజయ్ సేతుపతి ఆకట్టుకున్నాడు. అలాంటి పాత్రలో వేరే వాళ్ళని ఊహించుకోకుండా చేసాడు. వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. తుగ్లక్ దర్బార్ అనే తమిళ్ పొలిటికల్ డ్రామా లో నటిస్తున్నాడు. లాభం అనే తమిళ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇవే కాకుండా కడైసి వివసాయి, మా మనిదన్, కాతు వాక్కుల రెండు కాదల్.. ఇలా విజయ్ సేతుపతి చెయ్యబోయే సినిమాలు వరుసగా ఉన్నాయి.
కేవలం హీరో పాత్రలే కాకుండా తన దగ్గరికి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు వస్తే బాషా బేధం లేకుండా అన్ని పాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ దేశం గర్వించదగ్గ నటుడు అనే స్థాయికి ఎదిగాడు విజయ్ సేతుపతి. ‘సూపర్ డీలక్స్’, ‘మాస్టర్’, ‘ఆరెంజ్ మిత్తై’ లాంటి సినిమాలు విజయ్ సేతుపతి వైవిధ్యమైన సినిమాలే కాకుండా వైవిధ్యమైన గెట్ అప్ లకి కూడా ఉదాహరణగా నిలుస్తాయి. ఇలాంటి మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సినిమా అభిమానుల్ని ఇంకా చాలా సంవత్సరాలు అలరించాలని ఆశిద్దాం.