fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsకీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ వీడియో

కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ వీడియో

SpecialVideoOf KeerthiSuresh FromGoodLuchSakhi

టాలీవుడ్: తమిళ్ సినిమాలో సినీ ప్రయాణం ప్రారంభించి ‘మహానటి’ సినిమా ద్వారా నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుని ఆ సినిమా ద్వారా నేషనల్ అవార్డ్ కూడా తన సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా టీం కీర్తి సురేష్ కి సంబందించిన ఒక స్పెషల్ వీడియో విడుదల చేసారు. ఈ వీడియో లో ‘గుడ్ లక్ సఖి’ సినిమా షూటింగ్ కి సంబందించిన కీర్తి సురేష్ విజువల్స్ ని చూపించారు. ఈ వీడియో ద్వారా గుడ్ లక్ సఖి షూటింగ్ ఎంత ఫన్నీ గా హ్యాపీ గా జరిగిందో చూపించారు.

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా గా రూపొందుతుంది. ఒక పల్లెటూరు అమ్మాయి నేషనల్ లెవెల్ షూటింగ్ గేమ్స్ కి ఎలా వెళ్ళింది , నేషనల్ మెడల్ ఎలా శాసించింది.. ఇది సాధించడానికి ఆమె ప్రయాణాన్ని చూపించబోతున్నట్టు ఇదివరకే విడుదలైన టీజర్ లో తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. తాను తీసిన కొన్ని సినిమాలతోనే వైవిధ్యమైన దర్శకుడిగా పేరుపొందిన ‘నగేష్ కుకునూర్‘ ఈ సినిమాకి దర్శకత్వహిస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular