మూవీడెస్క్: డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ చిత్రం 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ విజయం ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలపై కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్లను సృష్టించింది.
ఇప్పటివరకు వచ్చిన సినిమాల కన్నా మేకర్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టడంపై దృష్టి సారిస్తున్నారు.
అందులో భాగంగానే, సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించాలని అనుకున్నారు.
కానీ, ఇప్పుడు ఈ సినిమాకి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టాలని మేకర్స్ నిర్ణయించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం భారీ కాస్టింగ్‌తో పాటు, లార్జర్ దెన్ లైఫ్ సీన్లను ప్రేక్షకులకు అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి 900 కోట్ల కలెక్షన్స్ సాధించగా, కల్కితో ప్రభాస్ 1000 కోట్ల క్లబ్‌లో చేరాడు.
ఈ నేపథ్యంతో, స్పిరిట్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించాలని మేకర్స్ ఆశిస్తున్నారు.
ఇక సినిమాలో విలన్ కోసం సైఫ్ అలీఖాన్ వంటి వారిని సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ ప్రాజెక్ట్ పైన ఇంకా అధికారిక వివరాలు రావాల్సి ఉంది.