యానిమల్ విజయంతో సందీప్ వంగా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో తీసే స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడం మాత్రం ఫ్యాన్స్‌కి నిరాశ కలిగిస్తోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ప్రచారం జరుగుతుండగా, కాస్టింగ్ పనులు మాత్రం ఇంకా క్లారిటీ దశకు రాలేదు.
ఇటీవల విడుదల చేసిన కాస్టింగ్ కాల్ ప్రకటనకు రిస్పాన్స్ బాగానే వచ్చినా, నటీనటుల ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. యాక్టర్ సుహాస్ పేరును తీసుకురాగా, ఆయన ఆ రూమర్లకు క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు మంచు విష్ణు పేరు కూడా వినిపిస్తోంది కానీ అధికారికంగా ఏదీ ఖరారు కాలేదు.
ప్రభాస్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. పలువురు టాప్ హీరోయిన్స్ పేరు తెరపైకి వచ్చినా, ఫైనల్ డిసిషన్ మాత్రం తీసుకోలేదని సమాచారం. విలన్ మరియు ఇతర కీలక పాత్రల విషయంలో కూడా సందీప్ వంగా ఎన్నో ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు టాక్.
స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ అధికారిగా మాస్ అవతారంలో కనిపించబోతుండటంతో, దర్శకుడు చాలా కేర్‌ఫుల్‌గా ప్లానింగ్ చేస్తున్నాడు. ఇంకొన్ని వారాల్లో పూర్తి కాస్టింగ్ ఫిక్స్ చేసి, సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.