న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇంత వరకు క్రీడా శాఖను నిర్వహించిన కిరణ్ రిజుజు వేరే శాఖకు బదిలీ అవడంతో అనురాగ్ ఈ బాధ్యతలను స్వీకరించ్రు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021కు సరిగ్గా రెండు వారాల ముందు కేంద్ర క్రీడల శాఖకు నూతన మంత్రి నియమితులయ్యారు.
ప్రధానమంత్రి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనురాగ్ ఠాకూర్‌కు ఈ అవకాశాన్ని ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ ఇంతకుముందే క్రీడలతో సంబంధముంది. గతంలో అనురాగ్ ఠాకూర్ 2016 మే నుంచి 2017 ఫిబ్రవరి వరకు బీసీసీఐకి అధ్యక్షుడిగా బధ్యతలు నిర్వహించ్రు. దానికి ముందు బీసీసీఐ సెక్రటరీగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా కూడా ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది.
కాగా, ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో విశ్వక్రీడలు జరగబోతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కారణంగా గతే ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఒలింపిక్స్‌ను జులై నెలలో ఎలాగైనా నిర్వహించాలని నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రివర్గంతో అత్యవసరంగా సమావేశమై జపాన్ ప్రధాని యొషిహిదె సుగా టోక్యోలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఈ చర్యతో ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంకోవైపు ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు కూడా ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. దానికి తోడు కొత్త క్రీడా మంత్రి రావడంతో ఏం జరుగుతుందోనన్న అయోమయంలో ఉన్నారు.