టాలీవుడ్: కీరవాణి వారసుడిగా సినీ ఇండస్ట్రీ కి హీరో గా అడుగుపెట్టాడు శ్రీ సింహ. ‘మత్తు వదలరా’ అనే సినిమాతో ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా హిట్ కొట్టాడు కానీ శ్రీ సింహ కి అంత గుర్తింపు రాలేదు. రెండవ ప్రత్యత్నంగా ‘తెల్లవారితే గురువారం’ అనే ఫామిలీ మరియు రొమాంటిక్ సబ్జెక్ట్ మూవీ తీసాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా కొంత మార్పు చూపించాడు శ్రీ సింహ. ఈ రోజు శ్రీ సింహ హీరోగా మూడవ సినిమా మొదలు పెట్టాడు.
‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. తెలుగు లో ఈ మధ్య మంచి క్యారెక్టర్ లు పోస్తిస్తున్న తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర ఖని ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి టాప్ బ్యానర్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు గురు ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సతీష్ త్రిపుర అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రోజు షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా గురించి మరి కొన్ని రోజుల్లో మిగతా అప్ డేట్స్ ఇవ్వనున్నారు.