టాలీవుడ్: ఒక్కో సినిమా ఒక్కో రకమైన కథని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు. బ్రోచేవారెవరురా సక్సెస్ తర్వాత శ్రీ విష్ణు సినిమాలు చేయడం లో దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ‘గాలి సంపత్’ , ‘రాజా రాజా చోర’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఈరోజు మరో సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. తాను నటించబోతున్న ‘అర్జున ఫాల్గుణ’ అనే సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు. సినిమా ఫస్ట్ లుక్ లో పోలీస్ వాన్ తరుముతుంటే పరిగెత్తుతున్న హీరో, హీరోయిన్ మరియు అతని ఫ్రెండ్స్ ని చూపించారు. అది కూడా డైరెక్ట్ గా కాకుండా నీటిలో మిర్రర్ ఇమేజ్ లాగ చూపించి కొత్తదనం చూపించారు.
చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ లాంటి సినిమాలని రూపొందిస్తున్న మాట్ని ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. అటు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు సినిమాలని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కి జోడీ గా అమృత అయ్యర్ నటిస్తుంది. ఆహా ఓటీటీ లో విడుదలై ప్రశంసలు పొందిన ‘జోహార్’ సినిమాని రూపొందించిన డైరెక్టర్ తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకే సంగీతం అందించిన ప్రియదర్శన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు.