
టాలీవుడ్: తెలుగులో వైవిధ్యమైన సినిమాలు తీస్తూ మెల్లిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. ‘ఈ పాత్రతో మీ ముందుకి రావడం నా అదృష్టం.ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం!’ అంటూ టీజర్ ని విడుదల చేసారు శ్రీ విష్ణు.
టీజర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ తన చోర కళని చూపించే పాత్రలో శ్రీ విష్ణు నటించాడు. పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లా ఈ సినిమా రూపొందింది. దాంతో పాటు బ్రోచేవారెవరురా లాంటి ట్విస్ట్ లు కూడా ఉన్నట్టు టీజర్ లో తెలుస్తుంది. టీజర్ లో శ్రీ విష్ణు డైలాగ్ కామెడీ టైమింగ్ బాగుంది అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్తూ దొంగతనాలు చేసే హీరో శ్రీ విష్ణు, ఎవడో ఒకడు దొంగ దొరక్కపోతడా వాడి పైన పెండింగ్ కేసులు అన్ని పెట్ట పోతానా అని ఎదురుచూస్తున్న పోలీస్ పాత్రలో రవి బాబు కనిపించాడు. చివరికి ఒక రోజు శ్రీ విష్ణు రవి బాబు కి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఎలా తప్పించుకున్నాడు అనే కథనం పైన సినిమా టాక్ ఆధారపడి ఉంటుంది.
ఈ సినిమాలో మేఘ ఆకాష్ చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ కనిపిస్తుంది. మరొక పాత్రలో తమిళ నటి సునయన నటించింది. ఈ టీజర్ లో ‘ఇంకో సొల్యూషన్’ చెప్పనా అనే ఒకే డైలాగ్ తో ఈ హీరోయిన్ పలు మార్లు కనిపిస్తుంది. మరొక పాత్రలో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ నటించింది. టీజర్ లో వినిపించే బాగ్ గ్రౌండ్ మ్యూజిక్, ‘రాజ రాజ చోర వేంచేస్తున్నాడు బహు పరాక్ బహు పరాక్’ లాంటి ఫీలర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్ , అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల వివరాలు మరి కొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు