హైదరాబాద్: ఐపీఎల్-2022 సీజన్ ఇంకా మొదలవకనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2022లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకనే సైమన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడం వల్లనే తను జట్టును వీడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటు కల్పించకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.