స్పోర్ట్స్ డెస్క్: SRH vs MI: ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబయి జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. 144 పరుగుల లక్ష్యాన్ని ముంబయి కేవలం 15.4 ఓవర్లలోే ఛేదించి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరచుకుంది.
ముంబయి విజయంలో రోహిత్ శర్మ (70) అద్భుతంగా రాణించగా, సూర్యకుమార్ యాదవ్ (40 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. రికెల్టన్ (11) వెంటనే అవుట్ అయినా, విల్ జాక్స్ (22) సపోర్ట్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో 9 ఏళ్ల తర్వాత వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ మళ్లీ ఫాంలోకి వచ్చాడన్న నమ్మకాన్ని ఇచ్చాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 143 పరుగులకు పరిమితమైంది. హెడ్, అభిషేక్, నితీశ్, కిషన్ తీవ్రంగా విఫలమయ్యారు. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు. వీరి మధ్య 99 పరుగుల భాగస్వామ్యం జరిగింది.
బౌలింగ్‌లో ముంబయి తరఫున ట్రెంట్ బౌల్ట్ (4/26), దీపక్ చాహర్ (2/12) చెలరేగారు. బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీశారు. ముంబయికి ఇది వరుసగా నాలుగో విజయం కాగా, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.