మూవీడెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, తన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు.
“ఓం భీమ్ బుష్”తో 2024లో హిట్ కొట్టిన శ్రీవిష్ణు, ఇప్పుడు తన తదుపరి చిత్రం “స్వాగ్”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రచారంలో మంచి ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్లు, టీజర్ విడుదలైనప్పుడు, శ్రీవిష్ణు నాలుగు వేరే వేరే గెటప్స్‌లో ఆకట్టుకున్నాడు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
కానీ ఈ విడుదల తేదీ నెటిజన్ల మధ్య చర్చలకు దారితీస్తోంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు వారం ముందు ఎన్టీఆర్ నటించిన “దేవర” రిలీజ్ అవుతుంది.
దీనితో “స్వాగ్”కు తగిన థియేటర్లు దొరకడం కష్టం అని అభిప్రాయపడుతున్నారు. ఇక విడుదలకు వారం తర్వాత రజనీకాంత్ “వెట్టయాన్” మరియు గోపీచంద్ “విశ్వం” సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.
అయితే, స్వాగ్ చిత్రంపై శ్రీవిష్ణు మరియు మేకర్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తోంది. కంటెంట్ బలమైనదని నమ్ముతున్న ఈ చిత్రబృందం పెద్ద సాహసమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.