టాలీవుడ్: వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ‘తాను నేను’ , ‘పేపర్ బాయ్’ సినిమాలతో హీరో గా ప్రయత్నాలు కొనసాగించాడు. రీసెంట్ గా లాక్ డౌన్ టైం లో ఓటీటీ లో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ఈ హీరో దశ తిరిగింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ నటనకి మంచి పేరు తో సహా ఈ హీరో వరుస ఆఫర్లు చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం దాదాపు 5 సినిమాల్లో నటిస్తున్న ఈ హీరో సినిమాల అప్ డేట్లు ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఈ మధ్యనే మారుతి దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ ఆకట్టుకున్నాయి. టైం చూసుకుని మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ రూపొందించే నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఇవే కాకుండా సంతోష్ హీరో గా నటిస్తున్న మరో సినిమా అప్ డేట్ ఈ రోజు విడుదలైంది. ‘శ్రీదేవి శోభన్ బాబు ‘ లాంటి ఓల్డ్ హీరో హీరోయిన్ నేమ్స్ తో వినిపించే పేరుని ఈ సినిమా టైటిల్ గా పెట్టి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ’96 ‘, ‘జాను’ , ‘మాస్టర్’ సినిమాల్లో మెప్పించిన గౌరీ కిషన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ స్థాపించి ‘షూట్ అవుట్ ఎట్ ఆలేర్’ అనే సిరీస్ ని నిర్మించారు. ఈ సినిమాతో మొదటి సారిగా సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.