టాలీవుడ్: థియేటర్లు తెరచుకుని వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటివరకు అన్నీ చిన్న సినిమాలే విడుదల అయ్యాయి. తిమ్మరుసు, ఇష్క్, SR కల్యాణమండపం ల తర్వాత ఈ వారం పాగల్ విడుదల అవుతుంది. వచ్చే వారం శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర‘ విడుదల అవనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు మరో సినిమాని ఆగష్టు చివరి వారంలో విడుదల అవనున్నట్టు ప్రకటించారు. ఎంతో కాలంగా మంచి హిట్ కోసం పరితపిస్తున్న సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా లో టైటిల్ లోని శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తుంది.
పలాస 1978 లాంటి ఇంటెన్స్ సినిమా రూపొందించిన కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. పూర్తిగా గోదావరి జిల్లాల్లో రూపొందించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉండే లవ్ మరియు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ గా రూపొందింది. ఈ సినిమా కోసం ఫిజిక్ పరంగా కూడా సుదీర్ బాబు బాగానే కష్టపడినట్టు టీజర్స్ చూస్తే తెలుస్తుంది. మణి శర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్లా, శశి దేవి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక ఇంటెన్స్ లవ్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగష్టు 27 న థియేటర్లలో విడుదల అవనుంది.