fbpx
Thursday, December 26, 2024
HomeNationalకరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేస్తాం

కరోనాతో చనిపోతే అంత్యక్రియలు చేస్తాం

SRIKAKULAM-REDCROSS-DOING-CREMATION-VOLUNTARILY

శ్రీకాకుళం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మానవ సంబంధాలను కాలరాస్తోంది. అక్కడెక్కడో కాదు మన దగ్గర కూడా మచ్చుకైనా మానవత్వం లేకుండా చేస్తోంది. కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే ఇంట్లో వాళ్లందరికీ వచ్చేస్తుందన్న భయం పట్టుకుంది.

కరోనా వచ్చిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సైతం వణుకుపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక చనిపోయిన రోగుల మృతదేహాల వద్దకు వెళితే కరోనా అంటుకుంటుందన్న అభద్రతా భావాన్ని సృష్టించింది. వాస్తవంగా కరోనాతో చనిపోయిన ఆరు గంటల తర్వాత మృతదేహం నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది.

ఈ విషయాన్ని అధికారులు, వైద్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం భయపడిపోతున్నారు. కరోనాతో చనిపోతే దగ్గరకు రావడం లేదు. ఆ మృతదేహాన్ని ముట్టు కోవడానికి సైతం ఎవరూ సాహసించడం లేదు. కరోనా మృతుల వద్దకే కాదు సాధారణంగా చనిపోయిన వారి దగ్గరికి సైతం వెళ్లడం లేదు.

కరోనా వలన చనిపోయారేమోనన్న భయంతో మృతదేహాలను తాకడం లేదు. దీనితో అంతిమ సంస్కారాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అవగాహనతో కొందరు యువకులు ఆ మృతదేహాలకు దహన కార్యక్రమాలు చేపట్టేందుకు మేమున్నా మంటూ ముందుకొస్తున్నారు. మృతి చెందిన 6 గంటల తర్వాత కరోనా వ్యాపించదని నిరూపిస్తున్నారు.

రెడ్‌క్రాస్‌ తరపున శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.తవుడు, ఎన్‌.ఉమాశంకర్, జి.సత్యసుందర్, ఎల్‌.రవికుమార్, పి.సూర్య ప్రకాష్, పి.చైత న్య, సిహెచ్‌ కృష్ణంరాజు, జి.విజయబాబు, బి.శ్రీధర్, కె.సత్యనారాయణ, జి.పవన్‌కుమార్‌ (డ్రైవర్‌), ఎన్‌.కోటీశ్వరరావు తదితరులు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సభ్యులు జిల్లాలో 20 కోవిడ్‌ మృతదేహాలకు, నాలుగు సాధారణ మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. కరోనాతో మృతి చెందినా, సాధారణ మృతులకైనా ఎక్కడైనా అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే 8333941444కు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తామని స్వర్గధామం రథం కో ఆర్డినేటర్‌ ఎన్‌.కోటీశ్వరరావు తెలియజేశారు. కరోనా మృతదేహాలపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదని, దహన సంస్కారాలు చేసేందుకు తాము సిద్ధమని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular