టాలీవుడ్‌లో హీరో శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ సినీ కెరీర్‌ను మళ్లీ సెటప్ చేసే పనిలో ఉన్నాడు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సంద-డి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోషన్, ఇప్పటివరకు పూర్తిగా కమర్షియల్ హిట్‌ను అందుకోలేకపోయాడు. దీంతో ఇప్పుడు అతని కెరీర్‌ను కొత్త దారిలో తీసుకెళ్లేందుకు శ్రీకాంత్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం రోషన్ చాంపియన్స్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయనున్నట్లు సమాచారం.
లింగుస్వామి ఈ సినిమాను తక్కువ సమయంలో పూర్తి చేసి, తన తదుపరి ప్రాజెక్ట్ మహాభారతం పై దృష్టి సారించనున్నట్లు టాక్. రోషన్ కోసం మరో నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని, వాటిలో రెండు స్క్రిప్టులు ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈసారి పూర్తిగా కమర్షియల్ యాంగిల్‌లో స్క్రిప్టులు ఎంచుకోవడమే రోషన్ లక్ష్యంగా కనిపిస్తోంది. మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా కథలు ఎంపిక చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాంత్ మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండటంతో, రోషన్‌కు టాలీవుడ్‌లో స్ట్రాంగ్ సపోర్ట్ దొరకనుందని టాక్.