టాలీవుడ్: కొత్తబంగారు లోకం సినిమా తో డైరెక్టర్ గా పరిచయం అయ్యి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద లాంటి సినిమాల ద్వారా గోదావరి నేటివిటీ సినిమాలని రూపొందించి మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల . తర్వాత మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో డిసాస్టర్ మూట కట్టుకోవడం తో దాదాపు 5 సంవత్సరాలు ఏ సినిమా తియ్యలేదు. తన సినిమాల ద్వారా మంచి తనం, మంచి, క్లాస్ టేస్ట్ ఉండే సినిమాల్ని చూపించిన అడ్డాల ఈరోజు విడుదలైన ‘నారప్ప‘ సినిమాతో మాస్ సబ్జెక్టు ని టచ్ చేసారు. ఈ సినిమా తమిళ్ లో రూపొందిన ‘అసురణ్’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా దాదాపు ఉన్నది ఉన్నట్టుగా రూపొందించడం తో అడ్డాలకి కూడా కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు.
అసురణ్ సినిమాకి సంబందించిన ఇంటర్వూస్ లో మాట్లాడుతూ తర్వాత ఒక మాస్ యాక్షన్ సినిమాని తియ్యబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమాకి ‘అన్నాయ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా తెలిపారు. మామూలుగా క్లాస్ సినిమాలు తీసే డైరెక్టర్ ఇలాంటి మాస్ సినిమాలు తియ్యగలడా అని ఇంటర్వ్యూయర్ అడగగా అందరికీ అన్ని టాలెంట్స్ ఉంటాయి సమయం వచ్చినపుడు బయట పడుతుంది అన్నట్టు తెలిపాడు. ‘అన్నాయ్’ సినిమాని సింగిల్ సినిమాలాగా కాకుండా రెండు మూడు భాగాలుగా రూపొందించి విడుదల చేస్తాను అన్న ప్లాన్ లో ఉన్నట్టు తెలిపారు. ఇంకా రైటింగ్ స్టేజ్ లో ఉందని పూర్తి అయిన తర్వాత మంచి హీరోని ప్రొడ్యూసర్ ని కలుపుకుని ఈ సినిమా మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.