fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsశ్రీకాంత్ వారసుడు హీరోగా పెళ్ళిసందడి చెయ్యబోతున్న దర్శకేంద్రుడు

శ్రీకాంత్ వారసుడు హీరోగా పెళ్ళిసందడి చెయ్యబోతున్న దర్శకేంద్రుడు

SrikanthSon RoshanDoing PellisandadiSequel

టాలీవుడ్: 90 ల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ‘పెళ్లి సందడి’. శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా శ్రీకాంత్ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా ఒక క్లాసిక్ గా కూడా నిలిచింది. ఈ సినిమా విడుదల అయ్యి 25 సంవత్సరాలు పూర్తి అయింది. రాఘవేంద్రరావు ఈ మధ్యనే మరో ‘పెళ్లి సందడి’ సినిమా తియ్యబోతున్నాడని ప్రకటించాడు. అయితే ముఖ్య తారాగణం ఎవరు అనేది ప్రకటించలేదు. నిన్న దసరా సందర్భంగా ఆ విషయాన్ని కూడా ధృవీకరించారు.

ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కుమారుడు ‘రోషన్’ ని హీరోగా ప్రకటిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేసారు మేకర్స్. ‘రోషన్’ ఇదివరకే ‘నిర్మల కాన్వెంట్’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం అంతగా అలరించకపోవడం తో మళ్ళీ స్టడీస్ పై ఫోకస్ పెట్టాడు ఈ హీరో. మళ్ళీ ఇప్పుడు తన తండ్రి సూపర్ హిట్ కి కొనసాగింపు గా అదే టైటిల్ తో రాబోతున్నాడు. బాహుబలి ని నిర్మించిన ‘ఆర్కా మీడియా వర్క్స్’ మరియు కే కృష్ణ మోహన్ రావు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దర్శకేందురు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘గౌరీ రోణంకి’ అనే డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని కూడా అద్భుతమైన మ్యూజికల్ హిట్ చెయ్యడానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular