కొలంబో: ఆదివారం శ్రీలంక తో రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
241 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించిన భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మొదటి వికెట్ కు రోహిత్, గిల్ మధ్య 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మిగతా వికెట్లు తక్కువ వ్యవధిలోనే మిగతా వికెట్లూ కోల్పోయి 208 కి ఆలౌట్ అయింది.
శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే ఒక్కడే 6 వికెట్లు తీసుకుని భారత బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చాడు.
ఇక సిరీస్ ఫలితం నిర్ణయించే మూడవ వన్డే ఆగస్ట్ 7వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. శ్రిలంక గెలిస్తే కప్ వాళ్ళ సొంతం అవుతుంది.