డంబుల్లా: టీ20 ఆసియా ఉమెన్స్ కప్ ఫైనల్స్ కు శ్రీలంక చేరింది. సెమిఫైనల్స్ లో పాకిస్తాన్ ను ఓడించి శ్రీలంక మహిళల జట్టు ఫైనల్స్ లో అడుగు పెట్టీంది.
కాగా, ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ ని ఓడించి ఫైనల్స్ కు చేరింది. ఇప్పుడూ భారత్ మరియు శ్రీలంక మధ్య ఫైనల్స్ ఆదివారం జరగనుంది.
పాకిస్తాన్ విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ చమరీ ఆటపట్టు 63 పరుగులతో జట్టుకు అపూర్వ విజయాన్ని అందించింది.