డంబుల్లా: ఆసియా ఉమెన్స్ కప్ 2024 ను శ్రీలంక కైవసం చేసుకుంది. ఫైనల్ లో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది.
కెప్టెన్ చమారి ఆటపట్టు అర్ధ శతకానికి హర్షిత సామరవిక్రమ సత్తా తోడవడంతో, శ్రీలంక భారత మహిళా జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక తమ తొలి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మొత్తం తొమ్మిది ఆసియా కప్ ఎడిషన్లలో (వన్డే మరియు టీ20) భారత్ రెండవసారి ఫైనల్‌లో ఓటమి చెందింది.
గతంలో భారత్ 2018లో కౌలాలంపూర్ లో బంగ్లాదేశ్‌తో ఫైనల్‌లో ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి శ్రీలంక అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ఆటపట్టు 61 పరుగులు (43 బంతులు, 9 ఫోర్లు, 2 సిక్సులు) మరియు సామరవిక్రమ 69 నాటౌట్ (51 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు) రాణించారు. 18.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విజయం సాధించారు.