కేజీఎఫ్ ఫ్రాంచైజ్‌తో బ్లాక్ బస్టర్ గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి.. ఆ తర్వాత కెరీర్ పరంగా తడబడిన విషయం తెలిసిందే. విక్రమ్‌తో చేసిన కోబ్రా చిత్రం పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ టాలెంట్‌పై నమ్మకంతో టాలీవుడ్‌లో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్-3’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ థ్రిల్లర్‌పై భారీ అంచనాలున్నాయి.
ట్రైలర్ ద్వారా ఈ సినిమా శ్రీనిధికి మంచి స్పేస్ కలిగిన పాత్రను ఇచ్చిందని టాక్. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే, శ్రీనిధికి ఇది మేజర్ కంబ్యాక్ అవ్వనుంది.
ఇదే సమయంలో ‘తెలుసు కదా’ అనే మరో చిత్రంతో సిద్ధు జొన్నలగడ్డ సరసన టాలీవుడ్ ఫుల్ ఎంట్రీకి రెడీ అవుతోంది. కానీ ఆ సినిమా కంటే ముందే ‘హిట్-3’ రిలీజ్ కావడం పాజిటివ్ బూస్ట్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె టాలెంట్‌ని గమనిస్తే.. వరుసగా అవకాశాలు రావడం ఖాయం.
ఇక శ్రీనిధి కెరీర్ మళ్లీ పుంజుకోవాలంటే ఈసారి తప్పకుండా హిట్ అవసరమే. ‘హిట్-3’ ఆమెకు కావాల్సిన బ్రేక్ ఇవ్వగలదా అన్నది ఈ నెలలో తేలనుంది.