టాలీవుడ్: కీరవాణి రెండవ కొడుకు శ్రీ సింహా హీరో పాత్రలో ‘మత్తు వదలరా’ అనే సినిమా వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కొత్త రకమైన టేకింగ్, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంది. ఇప్పుడు శ్రీ సింహా హీరో గా రెండవ సినిమా సిద్ధం ఐతుంది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు మూవీ మేకర్స్. ‘తెల్లవారితే గురువారం’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. టైటిల్ దగ్గరి నుండి క్రియేటివ్ గా ప్రయత్నిస్తున్నట్టు ఏర్పడుతుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో పెళ్లి కొడుకు గెట్ అప్ లో చేతిలో పూల దండ పట్టుకుని పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తున్నట్టు పోస్టర్ లో చూపించారు. అంతే కాకుండా మార్చ్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది సినిమా టీం. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రజిని కొర్రపాటి మరియు రవీంద్ర బెనర్జీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ ఈ సినిమాని సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర పిళ్ల అందించిన కథతో మణికాంత్ జెల్లీ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సినిమా లాగే రెండవ సినిమా కూడా వినూత్నంగా ప్రయత్నించి ఇండస్ట్రీ లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీ సింహా.