టాలీవుడ్: చిన్న చిన్న క్యారెక్టర్ లు వేస్తూ హీరో స్థాయి కి ఎదిగి కథలనే ఆధారంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘శ్రీ విష్ణు‘. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ తో పాటు గుర్తింపు కూడా సంపాదించాడు ఈ యువ హీరో. లాక్ డౌన్ లో ఆహా ఓటీటీ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ‘జోహార్’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన ‘తేజ మార్ని’ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నీది నాది ఒకే కథ’, ‘వీర భోగ వసంత రాయలు’ లాంటి సినిమాలు బాగున్నప్పటికీ అంతగా ఆడలేదు. కానీ బ్రోచేవారెవరురా ఇచ్చిన సక్సెస్ తర్వాత శ్రీ విష్ణు బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
బిగిల్, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా లాంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి అమృత. ఈ సినిమాలో శ్రీ విష్ణు కి జోడీ గా ఈ అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రోజు షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకి ‘బ్రోచేవారెవరు రా’ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. ఈ సినిమాలో కూడా శ్రీ విష్ణు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో నటించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రతి ఒక్కరు తమ లైఫ్ లో ఎదో ఒక స్టేజ్ లో అనుభవించి ఉంటారు అని చెప్పారు డైరెక్టర్. జోహార్ సినిమాకి సంగీతం అందించిన ప్రియదర్శన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది.