మూవీడెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, శ్రియ శరణ్, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించిన నా అల్లుడు 2005లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని వర ముల్లపూడి దర్శకత్వంలో ఏ. భారతి నిర్మించారు.
అయితే, మూవీ విడుదలైన 19 ఏళ్ల తర్వాత, హీరోయిన్ శ్రియ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
హాట్‌స్టార్ Show Time సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ, సినిమా బడ్జెట్ అనేక కారణాల వల్ల పెరిగి నిర్మాత చాలా కంగారు పడ్డారన్నారు.
షూటింగ్ చివరి రోజు తర్వాత అందరికీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో, నిర్మాత తన భావోద్వేగాలను దాచుకోలేక హుస్సేన్ సాగర్ చెరువులో దూకారని, అదృష్టవశాత్తూ అక్కడ ఉన్న వారు ఆయనను కాపాడారని శ్రియ తెలిపారు.
ఈ సంఘటన తనకు ఇప్పటికీ ఫన్నీగా అనిపిస్తుందని నవ్వుతూ చెప్పారు.
సోషల్ మీడియాలో ఆమె చెప్పిన ఈ కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది.
నా అల్లుడు చిత్రం భారీ బడ్జెట్‌తో వచ్చినా, ఎన్టీఆర్ క్రేజ్ వల్ల మంచి వసూళ్లు రాబట్టింది.