టాలీవుడ్: ‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు ‘కిరణ్ అబ్బవరం‘. ఈ నటుడు ప్రస్తుతం ‘SR కళ్యాణమండపం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మొదటి సినిమాలో ఒక అమాయకమైన పల్లెటూరి ప్రేమికుడిలా నటించిన ఈ హీరో రెండవ సినిమాకి ఒక కమర్షియల్ ఎంటర్టైనింగ్ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. కాలేజ్ లో చదువుకునే కుర్రాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండి లైఫ్ లో బాగు పడండి అనే హీరోయిన్ తండ్రి తో తానేంటో నిరూపించుకోవడానికి తన తండ్రి మొదలుపెట్టి లాస్ అయిన కల్యాణ మండపం పునరుద్ధరించి అది సక్సెస్ చేసే ప్లాన్ లో ఉంటాడు. ట్రైలర్ ని చూస్తే ఇది కథ అని ఒక అభిప్రాయం వస్తుంది.
ట్రైలర్ ఆద్యంతం కామెడీ తో ఆకట్టుకుంది. కాలేజ్ కామెడీ, లవ్ స్టోరీ, రొమాన్స్, తాను సెటిల్ అవడానికి హీరో పెట్టే ఎఫ్ర్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా ఈ సినిమాలో అన్ని కవర్ చేసి ట్రైలర్ ద్వారా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సాయి కుమార్ నటన, సాయి కుమార్ కామెడీ , డైలాగ్స్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ హీరో కిరణ్ అందించడం విశేషం. ఈ సినిమాతో డైరెక్టర్ శ్రీధర్ పరిచయం అవుతున్నాడు.