స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల తన స్నేహితుడి ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు అనే వ్యక్తి, తాను రాజమౌళి వల్ల టార్చర్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా, లేఖ ద్వారా మరిన్ని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రాజమౌళి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు ఎదురైతే తక్షణమే స్పందించే అవకాశం ఉంటుంది.
కానీ జక్కన్న మాత్రం మౌనం పాటించడంతో ఈ వ్యవహారాన్ని పెద్దగా హైలైట్ చేయొద్దని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కొంతమంది ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి ఇలాంటి విషయాల్లో ఇష్టపడకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ వివాదంపై రాజమౌళి నోరు విప్పుతారా? లేక మౌనంగానే ఉండిపోతారా? అన్నది వేచిచూడాలి. అయితే ఆయన తరఫున లీగల్ టీం స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.