టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నాడు. ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉండే జక్కన్న పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై తన స్నేహితుడిగా చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి వల్ల తన జీవితమే నాశనమైందని, ఇక బతకలేనని చెప్పుకుంటూ ఆయన ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది.
34 ఏళ్లుగా రాజమౌళితో స్నేహం ఉందని చెప్పుకున్న శ్రీనివాసరావు, తన కెరీర్ నాశనానికి జక్కన్న కారణమని ఆరోపించాడు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశానని, రాజమౌళి వల్లే తన వ్యక్తిగత జీవితం అంధకారంలో కూరుకుపోయిందని చెప్పాడు. రాజమౌళి డైరెక్టర్ కాకముందు తాను ప్రేమించిన అమ్మాయిని రాజమౌళి కూడా ప్రేమించాడని, చివరకు తనను త్యాగం చేయమని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
ఈ ఆరోపణలు ఇంతటితో ఆగలేదు. రాజమౌళి తాంత్రిక పూజలు చేసి ఎదిగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్‌లో ఇతర దర్శకులను అడ్డుకోవడానికి, తనను నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలిపేందుకు జక్కన్న బ్లాక్ మ్యాజిక్ చేసాడని లేఖలో పేర్కొన్నాడు.
ఇప్పటికే ఈ ఆరోపణలపై పలువురు సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. రాజమౌళిపై లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు, ఈ ఆరోపణలు కోర్టు వరకు వెళ్లే అవకాశముందా? అన్న చర్చ మొదలైంది. మరి జక్కన్న దీనికి ఎలా స్పందిస్తాడో చూడాలి.