సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమాపై రోజుకో ఆసక్తికర గాసిప్ బయటకు వస్తోంది. ఇప్పటికే పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కుతోందన్న టాక్ ఉంది.
తాజాగా ఇందులో డైనోసార్లు కూడా ఉంటాయని టాక్ నడుస్తోంది. కథ ప్రకారం అడవి నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్స్‌లో డైనోసార్లు భాగమవుతాయని ఇండస్ట్రీ టాక్. మల్టీపుల్ డైనోసార్ ఛేజ్ సీన్, మహేష్ బాబు వాటిని ఎదుర్కొనే యాక్షన్ బ్లాక్స్, ఓ స్పెషల్ క్లైమాక్స్ వరకు ఈ క్రియేచర్స్ చుట్టూ మేజర్ స్క్రీన్‌ప్లే ఉండబోతోందట.
వీటిని తెరకెక్కించేందుకు హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ బృందాలు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్ సాగుతోంది. ప్రాజెక్ట్ బడ్జెట్‌లో 30 శాతం వీఎఫ్‌ఎక్స్‌కే కేటాయించారని సమాచారం.
సుమారు 5 డైనోసార్ బేస్డ్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని, ఇవి సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ కథకు ప్రధాన బలంగా ఉండనుందని తెలుస్తోంది. KL నారాయణ నిర్మిస్తున్న ఈ మాస్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌కు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.