సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 పై ఉత్కంఠ తారస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా కాదు, గ్లోబల్ లెవెల్‌లోనే ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటివరకు అధికారిక అప్డేట్స్ ఎలాంటి స్పెషల్ వీడియో లేవు. కానీ తాజా బజ్ ప్రకారం, జూన్ లేదా జూలైలో ఒక భారీ గ్లింప్స్ వీడియోను విడుదల చేయాలని టీమ్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ గ్లింప్స్ కేవలం టైటిల్ రివీల్ కాదట. రాజమౌళి మూడ్‌కు తగ్గట్లుగా గ్రాఫిక్స్‌తో కూడిన స్పెషల్ ప్రెజెంటేషన్ వుండబోతోందని టాక్. ప్రస్తుతం ప్రీ విజ్యువలైజేషన్ స్టేజ్‌లో ఉన్న ఈ వీడియో త్వరలో ఫైనల్ అవుతుందట.
ఈ మూవీలో మహేష్ బాబు ఓ గ్లోబల్ యాత్రికుడి పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్వీరాజ్ నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీదుర్గా ఆర్ట్స్‌పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.