సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “SSMB29” మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వీడియో షేర్ చేయడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇటీవల తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకల కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంక, ఇప్పుడు షూటింగ్ కోసం మళ్లీ వచ్చారు. ఫిబ్రవరి 18 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఇందులో మహేష్ బాబు, ప్రియాంక పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో నానా పాటేకర్, ప్రిత్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అయితే క్యారెక్టర్లపై అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా, రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అడ్వెంచర్ యాక్షన్ థీమ్‌తో ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది. ప్రియాంక హైదరాబాదులో ఉండటంతో, కొత్త షెడ్యూల్ మరింత ఆసక్తికరంగా మారింది. మహేష్, ప్రియాంక జోడీ ఎలా ఉండబోతుందో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.