దర్శకధీరుడు రాజమౌళి ఈసారి మళ్ళీ ఆశ్చర్యపరచబోతున్నాడు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న SSMB29 సినిమా కోసం రాజమౌళి ఎప్పటిలా లేటుగా కాకుండా స్పీడ్‌గానే పని చేస్తున్నట్టు టాక్. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్‌లో ఒక్క అప్డేట్ కూడా రాలేకపోయినా… షూటింగ్ మాత్రం ఫాస్ట్ పేస్‌లో సాగుతుండడం విశేషం.
ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయని, మూడో షెడ్యూల్ ప్రస్తుతం స్పెషల్ ఫారెస్ట్ సెట్లో జరుగుతోందని సమాచారం. అంతకుముందు విదేశాల్లో యాక్షన్ ఎపిసోడ్లు షూట్ చేసిన రాజమౌళి, ఇండియా సెటప్‌లో కీలక భాగాలు తెరకెక్కిస్తున్నాడు.
టైమ్ వేస్ట్ కాకుండా ఈసారి ఫాస్ట్ ట్రాక్‌లోనే సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ ఈ సినిమాలో గ్లోబల్ అడ్వెంచర్ జర్నీ చేయనున్న యాత్రికుడిగా కనిపించనున్నాడు.
కథకు సంబంధించిన కీలక బిందువులను విజయేంద్ర ప్రసాద్ ముందుగానే వెల్లడించారు. ఇక హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఎంపికపై ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఒక సినిమా పూర్తికి రాజమౌళికి కనీసం రెండేళ్లు పడుతుండగా… ఈసారి మాత్రం ఒకటిన్నర సంవత్సరంలోనే సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో తెలియదుగానీ, జక్కన్న స్పీడ్ చూస్తుంటే ఈసారి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువే.