మూవీడెస్క్:సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉంటుందని, ఇలాంటి కథ ఇప్పటివరకు ఇండియాలో రాలేదని రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా వెల్లడించారు.
మహేష్ కెరీర్‌లో తొలిసారి ఈ జోనర్‌లో సినిమా చేయడం ప్రత్యేకతగా నిలవనుందని అన్నారు.
ఈ కథను సిద్ధం చేసేముందు, మహేష్ బాబు గతంలో ఇటువంటి పాత్ర చేషారా అనే విషయాన్ని పరిశీలించామని చెప్పారు.
కాంటెంపరరీ టచ్‌తోనే కథను డెవలప్ చేశామని, మహేష్ ఇమేజ్‌ను బలం కాకుండా కథే సినిమాను నడిపిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది.
మెజారిటీ షూటింగ్ కెన్యాలో జరగనుందని, రాజమౌళి ఇప్పటికే లొకేషన్లు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి.
సినిమా లీక్ కాకుండా జక్కన్న ప్రత్యేక ఏర్పాట్లు చేశారని టాక్.