టాలీవుడ్: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో వున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో టాప్ పొజిషన్ లో ఉన్నది ఎవరు అంటే థమన్ అని పేరు వినిపిస్తుంది. చాలా రోజులు థమన్ పైన కాపీ మరకలు ఉన్నప్పటికీ ఆయన నుండి వచ్చే సినిమాలు సూపర్ హిట్ లు అయ్యి మ్యూజికల్ పరంగా ఇండస్ట్రీ బార్రియర్ లు దాటి సక్సెస్ సాధిస్తున్నాయి .ఒకప్పుడు తమిళ్ కంపోజర్ లు వేరే ఇండస్ట్రీలో హిట్ లు సాధించేవారు. ఇపుడు మన ఇండస్ట్రీ నుండి కూడా థమన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలకి వరుసగా మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు.
థమన్ సంగీతం అందించిన ‘టక్ జగదీశ్ సినిమా’ విడుదలకి సిద్ధం గా ఉంది. ప్రస్తుతం థమన్ ఇండస్ట్రీ టాప్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలకి సంగీతం అందించనున్నాడు. ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాకి సంగీతం అందించిన థమన్ పవన్ -రానా కాంబినేషన్ లో రూపొందుతున్న అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ కి కూడా సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట‘ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు, దీనితో పాటు మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మరో సినిమాకి కూడా థమన్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడు.
ఇవే కాకుండా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా దిల్ రాజు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న సినిమాకి థమన్ సంగీతం అందించనున్నాడు. బాల కృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ, బాలకృష్ణ -గోపీచంద్ మలినేని సినిమాకి , అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రానున్న ఏజెంట్ సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా దాదాపు 10 సినిమాలకి అందులో క్రేజీ ప్రాజెక్ట్స్ కి పని చేస్తూ థమన్ జోరు చూపిస్తున్నాడు.