హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ మెడల్ విన్నర్ పీవీ సింధు గురించి తెలియని వారుండరు. తన బయో పిక్ కి కూడా రంగం సిద్ధం అవుతుంది. అయితే ప్రస్తుతం సింధు ఒక వెబ్ సిరీస్ లో నటించబోతుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించింది. ‘ది ఏ గేమ్’ అనే పేరుతో తియ్యనున్న వెబ్ సిరీస్ లో నటించబోతుంది. ఆమెతో సహా మరో నలుగురు ప్రముఖ అథ్లెట్లు ఇందులో నటించనున్నారు. తనను ఎంపిక చేయడంపై సింధు ఆనందం వ్యక్తం చేసింది. బేస్ లైన్ వెంచర్స్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వారు ‘డీకోడింగ్ సక్సెస్‘ థీమ్ తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించబోతున్నారు.
కొందరు స్టార్ ప్లేయర్ ల జీవితం లోని కొన్ని సంఘటనలు, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన విధానం ఇలా కొందరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించబోయే వెబ్ సిరీస్ లో పాత్ర అవబోతున్నందుకు సింధు ఆనందం వ్యక్తం చేసింది. భారత క్రీడా చరిత్రలో ఈ అథ్లెట్లు ఎలాంటి విజయాలు నమోదు చేశారు., కష్టాల్లో ఉన్నాప్పుడు వారి ఆలోచన దృక్పథం ఎలా ఉంటుంది సహా తదితర అంశాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు.అథ్లెట్లు తమ కెరీర్లోని ముఖ్య సంఘటలను ఇందులో పంచుకుంటారు. ఇప్పటికే ఈ సిరీస్లో వచ్చిన తొలి రెండు పార్ట్స్ ‘డబుల్ ట్రబుల్’, ‘ది ఫినిష్ లైన్’ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ‘ది ఏ గేమ్’ సిరీస్ రానుంది.