టాలీవుడ్: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటుడు సుధీర్ బాబు. కెరీర్ ఆరంభం నుండి వివిధ రకాల పాత్రలు వేస్తూ తనని తాను నిరూపించుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం తన 14 వ సినిమాని మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ జెనెరేషన్ లో అచ్చ తెలుగు సినిమాలు చేయగల కెపాసిటీ ఉన్న డైరెక్టర్ లలో మోహన కృష్ణ ఇంద్రగంటి ముందు వరుసలో ఉంటాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమాగా రాబోతుంది.
మొన్న ఈ సినిమా టైటిల్ గురించి సుధీర్ బాబు ఒక చిన్న ప్రశ్న లాగ సంధించి ఈరోజు సినిమా టైటిల్ ప్రకటిస్తానని అనౌన్స్ చేసాడు. ఈ ప్రశ్న కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని , అందులో చాలా మంది చెప్పిన సమాధానమే మా సినిమా టైటిల్ అని అదే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అని సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ ఒక వీడియో విడుదల చేసాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడి గా కృతి శెట్టి నటిస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై సుధీర్ బాబు సమర్పణలో మహేంద్ర బాబు , కిరణ్ బళ్ళపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి స్టైల్ అఫ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.