fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsతన ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేసిన సుధీర్ బాబు

తన ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేసిన సుధీర్ బాబు

SudheerBabu Inspirational Journey

టాలీవుడ్: ఈరోజు నుండి హీరో సుధీర్ బాబు, నాని , నివేత థామస్, అదితి రావు హైదరి నటించిన ‘వి’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఈ సినిమా లో సుధీర్ చేసిన యాక్షన్ స్టాన్ట్స్ అదిరిపోయాయని టాక్ వినిపిస్తుంది. ఈ రోజు సుధీర్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఒక అదిరిపోయే ఇన్స్పిరేషనల్ వీడియో షేర్ చేసాడు. ఆ వీడియో మరెవరిదో కాదు తనదే. వీడియో షేర్ చేస్తూ తాను ఎంత కష్ట పడ్డానో తెలియ చేసేందుకు ఈ వీడియో షేర్ చెయ్యట్లేదు, ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేసిన వాళ్ళకి స్ఫూర్తి కలిగించేందుకు షేర్ చేస్తున్న అని చెప్పారు.

ఈ ఇన్స్పైరింగ్ వీడియో లో ‘వి’ సినిమా షూటింగ్ కి ముందు సుధీర్ బాబు మోకాలు గాయం తో బాధ పడ్డారు. మోకాలికి చాలా ఫీజియో థెరపీల అనంతరం కోలుకున్నారు. ఈ ప్రాసెస్ లో తాను చాలా నొప్పిని భరించి కోలుకుని తన మోకాలు బలం పెంచుకున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం ఒక వీడియో లాగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు ఈ హీరో. ‘వి’ సినిమాకి కొద్దీ నెలల ముందు ఈ గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి నుండి భీభత్సమైన యాక్షన్ సన్నివేశాలు చేయగలిగాడు. ఇదంతా సినిమా పైన తన ఇష్టం అని తన ఇన్స్పిరేషన్, మోటివేషన్ సినిమా, ప్రేక్షకులే అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular