టాలీవుడ్: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చి ఎస్ఎంఎస్ సినిమాతో పరిచయం అయ్యి ఒక్కో అడుగు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో ‘సుధీర్ బాబు’. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తేడా లేకుండా తన దగ్గరికి వచ్చిన పాత్రలు సెలెక్టివ్ గా చేసుకుంటూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు సుధీర్ బాబు. తాజాగా మరొక సినిమా ప్రకటించాడు. ‘అష్టా చెమ్మ’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు డైరెక్టర్ ‘మోహన కృష్ణ ఇంద్రగంటి‘. ఇప్పుడు తెలుగు లో ఉన్న డైరెక్టర్ లలో మాటలకి, పాటలకి తెలుగు భాషలో ప్రత్యేక స్థానం కల్పించే డైరెక్టర్ లలో మోహన కృష్ణ ఇంద్రగంటి ముందుంటాడు. ఈయన దర్శకత్వం వహించిన
‘వీ’ సినిమా ని ఈ మధ్యనే ప్రైమ్ లో విడుదల చేసారు.
సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ‘సమ్మోహనం’ అనే సినిమా వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా నాని తో కలిసి ‘వీ’ అనే మల్టీ స్టారర్ చేసారు. ఇపుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది. దీనికి సంబందించిన ప్రకటన సుధీర్ బాబు దీపావళి సందర్భంగా చేసారు. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ సినిమాని బి.మహేంద్రబాబు,కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాల హీరోయిన్ గ నటించనుంది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ సంగీతంతో రాబోతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందబోతుంది.