టాలీవుడ్: లాక్ డౌన్ కి కొంచెం ముందు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘పలాస 1978 ‘. ఈ సినిమా ద్వారా సినిమా అభిమానులనే నుండే కాకుండా ఇండస్ట్రీ పెద్దల నుండి కూడా చాలా ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. ప్రస్తుతం ఈ దర్శకుడు తన రెండవ సినిమాని సుధీర్ బాబు తో కలిసి చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫామిలీ నుండి వచ్చి కొన్ని భిన్నమైన చిత్రాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘సుధీర్ బాబు’. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నాని ‘వి’ సినిమా ద్వారా మరొక మెట్టు ఎదిగాడు సుధీర్. ఈ సినిమాలో వచ్చే మొదటి 15 నిమిషాల యాక్షన్ సీక్వెన్సెస్ అదరగొట్టాడు.
ప్రస్తుతం ఈ హీరో , కరుణ కుమార్ తో కలిసి ’70 MM ఎంటర్టెయిన్మెంట్స్’ బ్యానర్ పై ఒక సినిమాలో నటించనున్నాడు. విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ బ్యానర్ లో సుధీర్ బాబు ఇదివరకే ‘భలే మంచి రోజు’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ లుక్ పోస్టర్ ఇవాల విడుదలైంది. ఒక కరెంట్ స్తంభం, పక్కన ఫెస్టివల్ లైటింగ్ కి వాడే సీరియల్ బల్బులు, ఎలెక్ట్రిషియన్ వాడే పరికరాలు, గోళీసోడాలు మరియు మల్లె పూలు. పోస్టర్ వైవిద్యంగానే ఉంది. ఇది కూడా మరో పీరియాడిక్ మూవీ లానే అనిపిస్తుంది. ఈ సినిమాని సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.