అంతర్జాతీయం: సముద్ర తీరాన సుదీక్ష కోణంకి దుస్తులు.. కేసు మిస్టరీ
సముద్రం వద్ద విద్యార్థినికి చెందిన దుస్తులు
కరేబియన్ దీవుల్లో విహరించేందుకు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని (Indian Origin Student) సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కేసులో కీలక ఆధారాలు వెలుగు చూశాయి. ఆమె దుస్తులు డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic)లోని ప్యూంటా కానా (Punta Cana) సముద్ర తీరంలో ఉన్న లాంజ్ కుర్చీ (Lounge Chair)పై కనిపించాయి. దీంతో కేసు మరింత మిస్టరీగా మారింది.
మట్టిలో కూరుకుపోయిన దుస్తులు
సముద్ర తీరాన దొరికిన దుస్తులలో కొన్ని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. ఆమె నీటిలోకి వెళ్లే ముందు వాటిని అక్కడే వదిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదృశ్యానికి ముందు ఆమె ధరించిన దుస్తుల వివరాలను క్రాస్‌చెక్ చేయగా, తాజాగా లభ్యమైనవి అదే అని పోలీసులు నిర్ధారించారు.
పార్టీ తర్వాత బీచ్‌కు వెళ్లిన విద్యార్థిని
వర్జీనియాకు (Virginia) చెందిన 20 ఏళ్ల సుదీక్ష మరో ఐదుగురు యువతులతో కలిసి వెకేషన్ కోసం డొమినికన్ రిపబ్లిక్‌లోని ప్యూంటా కానాకు వెళ్లింది. మార్చి 6వ తేదీ (March 6) రాత్రి రియూ రిపబ్లికా రిసార్ట్ (Riu Republica Resort)లో పార్టీకి హాజరైన ఆమె, తెల్లవారుజామున 3 గంటల వరకూ స్నేహితులతో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఐయోవాకు (Iowa) చెందిన 24 ఏళ్ల టూరిస్ట్ జాషువా స్టీవెన్ రిబె (Joshua Steven Ribe)తో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టమైంది.
ప్రధాన అనుమానితుడిగా జాషువా స్టీవెన్ రిబె
సుదీక్ష అదృశ్యమైన నేపథ్యంలో, ఆమె చివరిసారి కనిపించిన జాషువాను పోలీసులు విచారిస్తున్నారు. కానీ అతడు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అతడిపై అనుమానాలు మరింత పెరిగాయి. అతడి మోబైల్ కాల్ రికార్డులు, లాస్ట్ లొకేషన్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన.. కిడ్నాప్ అనుమానం
సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్, లోకల్ పోలీసులు, ఇంటర్‌పోల్ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు సుదీక్ష ఆచూకీ దొరకలేదు.