టాలీవుడ్: సినిమాలకి సంబందించిన వెబ్ మీడియా ప్రమోషన్స్ లో చాయ్ బిస్కెట్ చాలా పేరు సంపాదించింది. వాల్ల వీడియోస్ క్వాలిటీ తో పాటు కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. చాయ్ బిస్కెట్ టీం నుండి చాలా మంది సినిమా ఇండస్ట్రీ కి కూడా పరిచయం అవుతున్నారు. ఇపుడు చాయ్ బిస్కెట్ మరియు లహరి ఫిలిమ్స్ కలిసి ఫిలిం ప్రొడెక్షన్ కూడా మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఈ ఫిలిం ప్రొడక్షన్ మొదటి సారి ఒక సినిమాని నిర్మించబోతోంది. అది కూడా చాయ్ బిస్కెట్ నుండి మంచి పేరు సంపాదించి ఈ మధ్యనే కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ సాధించి తన నటనా పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసిన సుహాస్ తో. సుహాస్ హీరోగా ఇది రెండవ సినిమా.
‘WRITER : పద్మభూషణ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. టైటిల్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇవాల విడుదల చేసారు. ఇందులో సుహాస్ ‘తొలి అడుగు’ అనే పుస్తకాన్ని చూపిస్తూ ఉంటాడు. కింద రచయిత పద్మభూషణ్ అని ఉంటుంది. ఒక ఇన్స్పిరేషనల్ రచయిత పాత్రలో ఇందులో సుహాస్ పాత్ర ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ అనే నూతన దర్శకుడు పరిచయం అవబోతున్నాడు. ఈ సినిమాని మనోహర్ గోవింద్ స్వామి సమర్పణలో అనురాగ్ ,శరత్ ,చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తొందరగా పూర్తి చేసి 2021 లోనే విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు మంచి నటుడిగా పేరు పొందిన సుహాస్ ఈ సినిమా ద్వారా కూడా ఇంకా మంచి గుర్తింపు పొంది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని ఆశిద్దాం.