మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ గురించి హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం మాత్రమే మిగిలి ఉందని సమాచారం.
ముఖ్యంగా పవన్ సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పవన్ ఈ సినిమాను ఫుల్ కంప్లీట్ చేస్తారని టాక్.
ఇటీవల థాయ్‌లాండ్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ లేకుండా కొన్ని ఎలివేషన్ సన్నివేశాలను సుజిత్ చిత్రీకరించారు.
ప్రత్యేకంగా హీరో క్యారెక్టర్ హైలైట్ అయ్యే సీన్స్‌ని బ్యాంకాక్‌లో షూట్ చేస్తున్నారట.
ఈ యాక్షన్ డ్రామాను పాన్ ఇండియా లెవెల్‌లో యూనివర్శల్ అప్పీల్‌తో రూపొందించడానికి సుజిత్ హాలీవుడ్ నటులను కూడా చిత్రంలో భాగం చేసుకున్నారు.
వితయ పన్ స్రింగార్మ్, కజుకి కితామురా అనే అంతర్జాతీయ స్థాయి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్ మరియు యాక్షన్ మూవీస్‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నవారు. వీరి ఎంట్రీతో ఓజీ యాక్షన్ సన్నివేశాలకు భారీ అట్రాక్షన్ అందుతోంది.
ఈ సినిమాకు హై ఎండ్ ఫైట్ మాస్టర్స్ మరియు ఇంటర్నేషనల్ యాక్టర్లతో సుజిత్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది.