మూవీడెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన అనుభవంతోనే కాకుండా, తన శిష్యులను కూడా ఇన్నోవేటివ్ డైరెక్టర్లుగా మారుస్తున్న విషయం తెలిసిందే.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసిన పలువురు, ఇప్పుడు దర్శకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పల్నాటి సూర్య ప్రతాప్, బుచ్చిబాబు సానా, కార్తీక్ దండు వంటి దర్శకులు సుకుమార్ శిక్షణతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు అయ్యారు.
ఇప్పుడు మరో కొత్త శిష్యుడికి కూడా సుకుమార్ ఛాన్స్ ఇవ్వబోతున్నారు. తన ప్రొడక్షన్ హౌస్ అయిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ నుంచి ఈ కొత్త దర్శకుడి సినిమా ప్రారంభం కానుంది.
అయితే ఈసారి సుకుమార్ ఎప్పటిలా మైత్రీ మూవీ మేకర్స్‌తో కాకుండా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు.
టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ ప్రాజెక్ట్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకి దాదాపు 150 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కథ జోనర్ మీద స్పష్టత లేకపోయినా, సుకుమార్ ప్రణాళిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సుకుమార్ మాత్రమే కాకుండా, ఆయన శిష్యులు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుండటం ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ ను సూచిస్తోంది.
మరి ఆయన స్టూడెంట్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.