మూవీడెస్క్: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాంబినేషన్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రాబోతున్న తెలిసిందే.
‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా (RC17)పై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సుకుమార్ ప్రస్తుతం తన సూపర్ హిట్ మూవీ ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి సారించారు.
రామ్ చరణ్ కోసం సుకుమార్ ఓ విభిన్నమైన పాత్రను సిద్ధం చేశారని సమాచారం. ఈ పాత్రలో చరణ్ కసిగా యాక్షన్ సన్నివేశాల్లో నటించనున్నారు.
సుకుమార్ టీమ్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమై, ఈ ప్రాజెక్ట్ కోసం సీనియర్ రైటర్ల సహకారంతో కథను సిద్దం చేసింది. సినిమాను 2025 సమ్మర్ అనంతరం స్టార్ట్ చేసే అవకాశం ఉందట.
చరణ్ ఈ సినిమాలో ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సుకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ లుక్‌కు ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.
రామ్ చరణ్ గతంలో ఎప్పుడూ చేయని తరహా పాత్రలో కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
RC17 చిత్రం రెండు భాగాలుగా రాబోతుందనే వార్తలు వినిపించినప్పటికీ, ఇది సింగిల్ పార్ట్ మూవీ అని సుకుమార్ టీమ్ స్పష్టత ఇచ్చింది.