మూవీడెస్క్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌ను కుదిపేసింది.
పుష్ప 2 థియేటర్ సందర్శన కోసం వచ్చిన రేవతి అనే మహిళ మరణించడంతో పాటు, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనకు స్పందించిన దర్శకుడు సుకుమార్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
గాయపడిన శ్రీతేజ్‌కు పుష్ప 2 టీమ్ తరఫున తక్షణ ఆర్థిక సాయం అందింది.
అయితే, దర్శకుడు సుకుమార్ తన భార్య తబితతో కలిసి తరచుగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
మొదట రూ.5 లక్షలు సహాయం చేసిన సుకుమార్, అదనంగా రూ.50 లక్షల సాయం ప్రకటించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.
తబితా ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించగా, సుకుమార్ స్వయంగా అతని ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
ఈ సంఘటనపై సుకుమార్ చూపించిన దయ, బాధ్యత ప్రజల మన్ననలు అందుకుంది.
ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం కోలుకుంటుండగా, ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచిన సుకుమార్ మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
సుకుమార్, తబిత చేసిన సేవలు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల మధ్య కూడా చర్చనీయాంశంగా మారాయి.
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తూ, ఈ కుటుంబానికి సహాయం చేసిన సుకుమార్ గొప్ప మనసుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.