మూవీడెస్క్: టాలీవుడ్‌లో తన ప్రత్యేక మార్క్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు సుకుమార్, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విజయాలను సాధిస్తున్నాయి.
కానీ ఓ సందర్భంలో సుకుమార్ కెరీర్‌ను ముగించేందుకు సిద్ధమయ్యారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
డెబ్యూ చిత్రం ఆర్యతో సంచలనం సృష్టించిన సుకుమార్, వన్ నేనొక్కడినే వంటి హాలీవుడ్ స్టైల్ సినిమాలో తన టాలెంట్‌ను నిరూపించారు.
కానీ ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశపరిచినప్పుడు, కెరీర్‌పై మళ్లీ ఆలోచించే పరిస్థితి వచ్చింది.
తాజాగా డల్లాస్‌లో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో సుకుమార్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు.
“ఆ సినిమా ఇండియాలో బాగా ఆడలేదు. ఇక అమెరికాలో వసూళ్లు సాధించకపోయి ఉంటే, నేను సినిమాలకు గుడ్ బై చెప్పేవాడిని.
యూఎస్ ఆడియన్స్ నా జీవితాన్ని మార్చారు” అని అన్నారు. సుకుమార్ టాలెంట్‌కు ఆవకాషం కలిగిన ఆమేరికన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం సుకుమార్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఆయన తీసిన ఎన్నో హిట్ సినిమాలు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచాయి.
పుష్ప సిరీస్‌తో అందించిన జాతీయ స్థాయి విజయాలు ఆయన ప్రతిభను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.