టాలీవుడ్: అక్కినేని నాగేశ్వర్ రావు మనవడిగా పరిచయం అయిన సుమంత్ హీరోగా చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అడపా దడపా హిట్స్ వచ్చినా కూడా అది కంటిన్యూ చెయ్యలేకపోయాడు. ఈ మధ్య కాలంలో ‘మళ్ళీ రావా’ లాంటి క్లాసిక్ హిట్ వచ్చినా కూడా తర్వాత మరో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం ‘కవల్దార్’ అనే కన్నడ సూపర్ హిట్ సినిమాని తెలుగులో ‘కపటధారి’ అనే పేరు తో రీమేక్ చేసి విడుదలకి సిద్ధం చేసారు. ఇప్పుడు మరొక కొత్త గెట్ అప్ లో వేరే సినిమాతో పలకరించబోతున్నాడు.
‘అనగనగా ఒక రౌడీ ‘ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ని సుమంత్ విడుదల చేసాడు. సంక్రాంతి సందర్భంగా తను నటించబోయే తర్వాత సినిమా లుక్ ఇది అని రివీల్ చేసాడు. ఈ లుక్ లో కొంచెం ఓల్డ్ గెట్ అప్ లో కనిపిస్తున్నాడు సుమంత్. మీసాలు, గుబురు గడ్డం పెంచి పంచ కట్టుకుని ఉన్న లుక్ విడుదల చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసాడు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ‘ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై గార్లపాటి రమేష్ మరియు వీ.భట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మను అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు కొద్దీ రోజుల్లో విడుదల చేయనున్నారు.