టాలీవుడ్: అక్కినేని కుటుంబం నుండి పరిచయం అయిన నటుడు సుమంత్. కెరీర్ మొదటి నుండి లవ్ స్టోరీస్, మాస్ స్టోరీస్ లో నటించాడు కానీ లవ్ స్టోరీస్ తోనే కొన్ని సక్సెస్ లని పొందగలిగాడు. చివరగా ‘మళ్ళీ రావా’ అనే సినిమాతో మంచి క్లాసిక్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘కపటదారి’ అనే రీమేక్ సినిమాని ఈ నెల 19 న విడుదల చేయబోతున్నాడు. ఐతే ఈ హీరో ప్రస్తుతం ఒక కొత్త పాత్రలో కనిపించనున్నాడు. విశాఖ బ్యాక్ డ్రాప్ లో ‘వాల్తేర్ శ్రీను’ అనే రౌడీ పాత్రలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సుమంత్ మొదటి సారి ఒక మేక్ ఓవర్ పాత్రలో నటించనున్నాడు.
అనగనగా ఒక రౌడీ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రోజు సుమంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి సుమంత్ లుక్ ఒకటి విడుదల చేసి విషెస్ తెలియచేసారు సినిమా టీం. మను యజ్ఞ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గార్లపాటి రమేష్, టీ.ఎస్. వినీత్ భట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సుమంత్ ఈ సారి కొత్త రకమైన పాత్రలు కూడా ఎంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.