టాలీవుడ్: రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న సినిమాలాగ విడుదలై అనూహ్యమైన విజయం సాధించిన సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’. అద్భుతమైన కలెక్షన్స్ మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన సినిమా ఇది. ఈ సినిమా డైరెక్టర్ ‘వెంకటేష్ మహా’, అలాగే ప్రొడ్యూసర్ ‘విజయ ప్రవీణ పరుచూరి’ మళ్ళీ మరొక సినిమా మొదలు పెట్టబోతున్నారు. దీనికి సంబందించిన అనౌన్స్మెంట్ చేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు ఈ సినిమా టీం.
‘సు మతి’- ఆన్ ఎంపైర్ స్టేట్ అఫ్ మైండ్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందించబోతుంది. పోస్టర్ చూస్తుంటే అమెరికా బేస్డ్ సినిమాలాగే అనిపిస్తుంది. పోస్టర్ లో అమెరికా లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ముందు నుంచున్న ఒక ఓల్డ్ ఏజ్ స్త్రీ ఆ బిల్డింగ్ చూస్తున్నట్టు చూపించారు. ‘సు మతి’ అనే టైటిల్ లో సు కి మతి కి స్పేస్ ఇచ్చి ఆమె మైండ్ సెట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంత గొప్పడి అన్నట్టు చెప్పకనే చెప్పారు. వెంకటేష్ మహా కి మనసులు కదిలించే సినిమాలు, సున్నిత మైన హావ భావాలతో తియ్యగలడని ఆయన తీసిన ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలు నిరూపించాయి. ఇపుడు ఈ సినిమా కూడా అదే జానర్ లో తియ్యబోతున్నాడు అనిపిస్తుంది.